TSRTC Samme: KCR Trying To Break Down The Telangana Band | RTC సమ్మెపై ఉక్కు పాదం మోపుతున్న కేసీఆర్‌

2019-10-18 1,418

TSRTC Samme Going as Serious issue in Telangana. In that way, rtc jac leaders given call to telangana bandh. Is It CM KCR is trying to fail the telangana bandh, this type of publicity viral in social media.
#tsrtcsamme
#tsrtcnewstoday
#telanganacmkcr
#tsrtcJobs
#tsrtcnews
#Ashwathama Reddy
#PuvvadaAjayKumar
#tsrtctaffDemands
#someshkumar
#tsrtcmdsunilsharma
#dasarafestival
#tsrtcjac

ఉద్యమ స్ఫూర్తితో మహా నేతగా ఎదిగారు. ఉద్యమ నేతగా బలపడి తిరుగులేని రాజకీయ వేత్తగా మారారు. తెలంగాణ ఉద్యమంలో బక్కపలుచని మనిషిగా ముద్రపడ్డ కేసీఆర్.. తర్వాత కాలంలో బలమైన వ్యక్తిగా తయారయ్యారు. కేసీఆర్‌ మాటల ధాటికి కౌంటర్ ఇవ్వలేని తీరుగా.. అసలు ప్రతిపక్షం మాట లేని వ్యవహారంగా రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు, కళాకారులు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు.. ఇలా ప్రతి ఒక్కరి పాత్ర ఉందనేది అందరికీ తెలిసిందే. ఉద్యమం నుంచి వచ్చి ఉద్యమ నేతగా బలపడి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన సీఎం కేసీఆర్.. ప్రస్తుతం ఆర్టీసీ కార్మికుల సమ్మెను అణిచివేయాలని చూయడం దేనికి సంకేతమనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నెల 19న ఆర్టీసీ జేఏసీ నేతలు తలపెట్టిన తెలంగాణ బంద్‌ సక్సెస్ కావొద్దనే కారణంతోనే విద్యాసంస్థలకు దసరా సెలవులు పొడిగించారనే వాదనలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.